ETV Bharat / state

'ధరణి ' రెవెన్యూ శాఖలో సువర్ణ అధ్యాయం: కలెక్టర్

ధరణి పోర్టల్ ప్రారంభం రెవెన్యూ శాఖ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం అన్నారు. భూపాలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్​ను ప్రారంభించారు.

jayashanker bhupalapalli collector mahamad abdul ajeem inaugurated dharani portal
'ధరణి ' రెవెన్యూ శాఖలో సువర్ణ అధ్యాయం: కలెక్టర్
author img

By

Published : Oct 29, 2020, 3:17 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం ధరణి పోర్టల్​ను ప్రారంభించారు. ధరణి ప్రారంభం రెవెన్యూ శాఖ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమన్నారు. ఇకనుంచి దళారుల ప్రమేయం లేకుండా రైతులు.. నేరుగా వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.

ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ పారదర్శకంగా జరుగుతుందని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చేసుకునే వారు నేరుగా ధరణి పోర్టల్ ద్వారా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకుంటే.. తహసీల్దార్, జాయింట్ సబ్ రిజిస్టర్ దరఖాస్తులను పరిశీలించి రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పారు.

జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో ధరణి సేవలను ప్రారంభించారని చెప్పారు. రైతులకు మరింత సేవ చేసే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా తహసీల్దార్లకు లభించినందున.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని.. వేగంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. ధరణి పోర్టల్​ ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్​గా పాల్గొనడం గొప్ప అదృష్టమని మహమ్మద్ అబ్దుల్ అజీం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ అశోక్ కుమార్, ఇ- డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీకాంత్, డిప్యూటీ తహసీల్దార్ రవీందర్, ఆర్ఐ దేవేందర్, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన కల్వకుంట్ల కవిత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.