ETV Bharat / state

'మహిళలు ఎవరు అత్యాచారాలకు గురికాకూడదు' - సఖి కేంద్రాలకు అంబులెన్స్ సర్వీసులు

మహిళల సంరక్షణకై మోడల్​ కేంద్రంగా సఖి కేంద్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్​ అజీమ్​ తెలిపారు. మహిళలు వేధింపులకు, దాడులకు గురైనప్పుడు.. ముందుకు వచ్చి ఈ అంబులెన్స్ సౌకర్యాన్ని వాడుకోవాలని సూచించారు.

jayashankar bhpalapally collector starts ambulance services for sakhi center
'మహిళలు ఎవరు అత్యాచారాలకు గురికాకూడదు'
author img

By

Published : Jun 10, 2020, 2:27 PM IST

దాడులకు, హింసకు గురైన మహిళలను తరలించడానికి సఖి కేంద్రం ద్వారా ఏర్పాటు చేసిన 181 అంబులెన్స్ సర్వీసును జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహహ్మద్ అబ్దుల్ అజీమ్ ప్రారంభించారు. మహిళలు ఎవరు అత్యాచారాలకు, అణిచివేతకు గురికాకుడదనే ప్రధాన ఉద్దేశంతో సఖి కేంద్రం నిర్వహిస్తున్నామని తెలిపారు.

బాధిత మహిళలను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా... లీగల్​కూడా సహకారం అందిస్తామని... బాధిత మహిళకు న్యాయం జరిగేలా చేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. సఖి కేంద్రం బలోపేతానికి జిల్లా కలెక్టర్​గా పూర్తి మద్దతు ఇస్తామన్నారు. అదేవిధంగా జిల్లాలో మహిళలు, దివ్యాంగులకు ఎలాంటి సహకారం కావాలన్నా తమ వంతు సాయం అందిస్తున్నామని తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.