ETV Bharat / state

21 ఏళ్లకే కోచ్​గా తెలంగాణ యువతి ఎంపిక..!

Interview with Burra Lasya: ఏం చేసినా ప్రత్యేకంగా ఉండాలన్నది బుర్రా లాస్య కోరిక. సాధారణంగా ఆట నుంచి రిటైర్ అయ్యాక 'కోచ్ 'గా మారుతుంటారు కదా! కానీ 21 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నుంచి కోచ్ గాను ఎంపికైంది తను. తెలంగాణ నుంచి ఆ ఘనత సాధించిందీ తనే. ఇంతకీ ఇదంతా ఎందుకు చేసిందో... తన మాటల్లోనే!

Burra Lasya
బుర్రా లాస్య
author img

By

Published : Jan 3, 2023, 7:31 PM IST

Interview with Burra Lasya: నాన్న బుర్రా రమేశ్‌ యూనివర్సిటీ వాలీబాల్‌ క్రీడాకారుడు. అమ్మ సునీత జాతీయ అథ్లెట్‌. ఎక్కడ ఆటల పోటీలున్నా తీసుకెళ్లేవారు. అలా వాటి మీద మక్కువ ఏర్పడింది. ఏ పని చేసినా ప్రత్యేకత ఉండాలనుకుంటా. అందుకే అమ్మాయిలు తక్కువుండే క్రికెట్‌ మీద నా దృష్టి పడింది. చిన్నప్పటి నుంచి తమ్ముడు, తన స్నేహితులతో క్రికెట్‌ ఆడేదాన్ని. ఓసారి వరల్డ్‌కప్‌ చూస్తున్నా.. అప్పుడే ఈ ఆటకున్న ఆదరణేంటో అర్థమైంది. ఇంకా తెలుసుకున్నాక దీన్నే కెరియర్‌గా ఎంచుకోవాలనుకున్నా. అప్పటికి నాకు పదహారేళ్లు! నా ఆసక్తిని అమ్మానాన్న ప్రోత్సహించారు. మాది తెలంగాణ రాష్ట్రం, జయశంకర్‌ జిల్లా భూపాలపల్లి. నాన్న ప్రస్తుతం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌, అమ్మ జిల్లా యువజన క్రీడల అధికారిణి.

కోచింగ్‌పై ఆసక్తి!

డానియెల్‌, రాంపాటిల్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ క్రికెట్‌ అకాడమీల్లో శిక్షణ తీసుకున్నా. ఆల్‌రౌండర్‌ని.. రాష్ట్ర స్థాయిలో అండర్‌-19 జట్టుకీ ఆడా. మనం నేర్చుకోవడం సరే... ఆ పరిజ్ఞానాన్ని నలుగురికీ పంచాలి అన్నది నా తత్వం. అందుకని మొదటి నుంచి కొత్తవాళ్లకి సాయపడేదాన్ని. నా ఆసక్తి చూసి మా కోచ్‌ సమయం దొరికినప్పుడల్లా నేర్పమనే వారు. క్రమంగా అదో అలవాటుగా మారింది. లాక్‌డౌన్‌లో కావాల్సినంత సమయం దొరికింది. ఇంకేముంది... కోచింగ్‌ పుస్తకాలు, ఐసీసీ వెబ్‌సైట్‌ నుంచీ సమాచారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకొని చదివేదాన్ని. ప్రాక్టికల్‌గా కూడా ప్రయత్నించే దాన్ని. దీని ద్వారా నా ఆటను మెరుగుపరచుకోవచ్చు. వేరేవాళ్లకి బోధించడమూ సులువనిపించేది. సందేహాలుంటే కోచ్‌ల సాయం తీసుకునేదాన్ని. అప్పుడే ఐసీసీ ఏటా ప్రపంచ వ్యాప్తంగా రెండుసార్లు కోచ్‌ల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తుందని విన్నా. నాకెలాగూ ఆసక్తి ఉంది కాబట్టి, ప్రయత్నిద్దామని దరఖాస్తు చేశా. ఆట, కోచింగ్‌ ఆసక్తులపై ప్రశ్నలు ఇస్తారు. సమాధానాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. 30-40 మందిని రెండు బ్యాచ్‌లుగా ఎంపిక చేశారు. దాదాపు 20 రోజులపాటు గూగుల్‌ మీట్స్‌లో ‘కోర్స్‌ ఆఫ్‌ ఆక్టివిటీస్‌’ పేరిట ఇన్‌పుట్స్‌ ఇస్తారు. వాటిని పూర్తిచేయాలి. దాన్ని విజయవంతంగా చేసి మూడింటిలో లెవల్‌-1 సర్టిఫికెట్‌ పొందా. తెలంగాణ నుంచి ఇది సాధించిన మొదటి అమ్మాయిని నేనే. నాతోపాటు ఇంకో ఇద్దరు అమ్మాయిలు వేరే రాష్ట్రాల వారున్నారు.

ఆటపైనే దృష్టి

కోచ్‌ సర్టిఫికెట్‌తో అధికారికంగా ప్రాథమిక స్థాయి వాళ్లకి ఆట నేర్పించొచ్చు. దాంతో పాటు మంచి క్రీడాకారిణిగానూ రాణించాలనేది కోరిక. చదువులోనూ ముందే ఉంటాను. కేఎల్‌ యూనివర్సిటీ నుంచి బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్స్‌ చేశా. ఇప్పుడు అమెరికాలో మాస్టర్స్‌ చేస్తున్నా. తెల్లవారుజామున 5 నుంచి 8 వరకు సాధన. సాయంత్రం కళాశాల పూర్తవగానే గ్రౌండ్‌కి వెళ్లిపోయేదాన్ని. కిట్‌ బ్యాగ్‌ పట్టుకొనే కాలేజ్‌కి వెళ్లేదాన్ని. అమెరికాకీ నా కిట్‌ తీసుకొచ్చా. రోజూ సాధన చేసుకునేలా ప్లాన్స్‌ వేసుకున్నా. కరోనా తర్వాత అంతా ఆన్‌లైన్‌ అయిపోయింది కాబట్టి, అదే విధానంలో కోచింగ్‌ కొనసాగిద్దామనుకుంటున్నా. మన జాతీయ జట్టులో స్థానం సంపాదించాలి. మరింత మంది అమ్మాయిలకు శిక్షణిచ్చి ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలి, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదగాలన్నవి నా కలలు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.