మాజీ స్పీకర్ మధుసూదనాచారి 65వ జన్మదిన వేడుకలను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా జరిపారు. స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.
జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో తెరాస నాయకులు, మధుసూదనాచారి అభిమానులు భారీ ఎత్తున పాల్గొని కేక్ కట్ చేసి టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.
ఇదీ చదవండిః తెనాలిలో మాజీ ప్రధాని పీవీ, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలు