అర్హత గల ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే సబ్సీడీతో యూనిట్లను అందజేస్తున్నట్లు... జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు.
సమన్యాయం జరిగేలా...
అందరికీ సమాన న్యాయం జరిగేలా జనాభా ప్రాతిపదికన లబ్ధిదారులను ఎంపిక చేయాలని... పరిశ్రమలశాఖ అధికారులను ఆదేశించారు. సబ్సీడీతో వాహనాలు, సేవా రంగాల ఉపాధి యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలను... జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీనివాస్ కలెక్టర్‌కు తెలియజేశారు.
ప్రభుత్వ బ్యాంకుల ఎంపిక...
దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి తదుపరి సమావేశంలో లబ్ధిదారుల వివరాలను కమిటీ ముందుంచాలని అన్నారు. సబ్సీడీ రుణాలను అందించేందుకు ప్రైవేటు బ్యాంకులకు బదులుగా ప్రభుత్వ బ్యాంకులను ఎంపిక చేయాలని తెలిపారు.
ఇదీ చదవండి: ఎయిరోస్పేస్ హబ్‌గా తెలంగాణ: మంత్రి కేటీఆర్