జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ, చిట్యాల మండలాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. నైన్ పాక, చల్లగారిగా గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరగ్గా… విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
చిట్యాల మండలం నైన్పాక గ్రామంలో వర్షానికి చెట్టు నేలకూలడంతో దుక్కిటెద్దు మృతి చెందింది. భూపాలపల్లి, ఘనపూర్, టేకుమాట్ల, మొగుళ్లపల్లి మండలాల్లో అక్కడక్కడ వర్షం కురిసింది.
ఇవీ చూడండి: ఆ జిల్లాల్లో సడలింపులు ఇవ్వొద్దు: వైద్యఆరోగ్య శాఖ