జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులు సమావేశమయ్యారు. ఈ నెల 11న జరిగే లోక్సభ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లపై చర్చించారు. కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎస్పీ ఆర్. భాస్కరన్, జిల్లా ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో రెండు లక్షల 60 వేల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లను చేశామని వెల్లడిచారు. దివ్యాంగులకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. గతం కంటే ఎక్కువ పోలింగ్ నమోదు కావాలని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఓటర్లను కోరారు.
నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కాబట్టి పోలీస్ బందోబస్తును పకడ్బందీగా ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా ఎస్పీ కోరారు.
ఇవీ చూడండి: వరంగల్ లోక్సభ బరిలో 15 మంది అభ్యర్థులు