రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని ఆల్ ఇండియా అఖిల పక్షాల ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. రైతులు పండించిన సన్నరకం వరి ధాన్యానికి క్వింటాకు రూ. 2,500 మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
సన్న ధాన్యానికి రూ. 2,500 మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర నాయకులు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. నాయకులంతా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రేపు సాయంత్రం రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం