జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఆవరణలో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా శ్రమదానం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి వాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ప్రజలతో కలిసి పిచ్చి మొక్కలను తొలగించారు. పల్లెలన్నీ పచ్చదనం, పరిశుభ్రతతో వికసించాలని సీఎం కేసీఆర్ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆయన పేర్కొన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీచూడండి: ఏప్రిల్ 1 నుంచి బ్యాంకుల విలీనం అమల్లోకి!