ETV Bharat / state

ఉద్యమం పేరుతో పదవులు అనుభవించిన ద్రోహి కడియం: వైఎస్ షర్మిల - వరంగల్ జిల్లా తాజా వార్తలు

YS Sharmila Counter to Kadiyam Srihari: కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల స్పందించారు. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని పదవులు అనుభవించిన ద్రోహి కడియం అని దుయ్యబట్టారు. 14 ఏళ్లు మంత్రిగా ఉండి.. నియోజకవర్గానికి ఒక్క డిగ్రీ కాలేజీ తీసుకురాలేదని ఆమె మండిపడ్డారు.

YS Sharmila
YS Sharmila
author img

By

Published : Feb 8, 2023, 7:46 PM IST

Updated : Feb 8, 2023, 7:56 PM IST

ఉద్యమం పేరుతో పదవులు అనుభవించిన ద్రోహి కడియం: వైఎస్ షర్మిల

YS Sharmila Counter to Kadiyam Srihari: తనపై కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలకు వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని పదవులు అనుభవించిన ద్రోహి కడియం అని మండిపడ్డారు. 14 ఏళ్లు మంత్రిగా ఉండి నియోజకవర్గానికి.. ఒక్క డిగ్రీ కాలేజీ తీసుకురాలేదని ఆరోపించారు. జనగాంలోని కొన్ని మండలాల్లో ఇంటర్ కాలేజీలు కూడా లేవని విమర్శించారు. జనగాంకి పరిశ్రమలు వస్తాయి అన్నారు.. ఒక్కటీ కూడా రాలేదని దుయ్యబ్టటారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్​లో ఏర్పాటు చేసిన సభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో ఇద్దరు నాయకులుండి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. గజ్వేల్ ఎలా ఉంది..? స్టేషన్ ఘనపూర్ ఎలా ఉంది..? అని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడని షర్మిల ధ్వజమెత్తారు.

ప్రజాప్రస్థాన యాత్రలో భాగంగా వైఎస్ షర్మిల జనగామ జిల్లాలో పర్యటిస్తున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ పరిధిలో ఆమె పాదయాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఓ వైపు షర్మిల రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

"ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని పదవులు అనుభవించిన ద్రోహి కడియం. 14 ఏళ్లు మంత్రిగా ఉండి ఒక్క డిగ్రీ కాలేజీ తీసుకురాలేదు. జనగాంలోని కొన్ని మండలాల్లో ఇంటర్ కాలేజీలు కూడా లేవు. జనగాంకి పరిశ్రమలు వస్తాయి అన్నారు.. ఒక్కటీ రాలేదు. నియోజకవర్గంలో ఇద్దరు నాయకులుండి ఏం ప్రయోజనం. గజ్వేల్ ఎలా ఉంది..? స్టేషన్ ఘనపూర్ ఎలా ఉంది..?." - వైఎస్ షర్మిల, వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు

నిన్న తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. దీనిపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి స్పందించారు. షర్మిల ఈ విధంగా మాట్లాడటం బాధాకరమని మాట్లాడటం బాధాకరమని కడియం అన్నారు. వైఎస్‌ కుటుంబం మొదటినుంచి తెలంగాణకు వ్యతిరేకమేనని పేర్కొన్నారు. సమైక్యాంధ్ర నినాదంతో ఊరూరా తిరిగిన వ్యక్తి షర్మిల అని గుర్తు చేశారు. జగన్‌ జైలులో ఉన్నప్పుడు ఆమె పాదయాత్ర చేశారని తెలిపారు. షర్మిలకు జగన్‌ రాజకీయంగా అన్యాయం చేశారని వివరించారు. షర్మిల.. ఆంధ్రాకు వెళ్లి అక్కడి ప్రజలకు మొర పెట్టుకోండని కడియం సూచించారు. దీనిపై షర్మిల ఇవాళ్టి సభలో భగ్గున్నారు.

ఇవీ చదవండి: రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులకు.. ఖర్చులకు పొంతనలేదు : వైఎస్ షర్మిల

బీఆర్ఎస్ దాడులకు భయపడను: వైఎస్‌ షర్మిల

నాకు పోలీస్ కేసులు కొత్త కాదు.. భయపడే ప్రసక్తే లేదు: రేవంత్​రెడ్డి

'UPA పాలనలో ఒక దశాబ్దం వృథా.. భారత్​ పరువు గంగపాలు'.. మోదీ తీవ్ర విమర్శలు

Last Updated : Feb 8, 2023, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.