కేంద్ర ప్రభుత్వం పింఛన్ల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తే.. కేంద్రం రూ.105 కోట్లు మాత్రమే ఇస్తోందని... కాదని నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.
రాష్ట్రంలో 38,64,751 మందికి పింఛన్లు ఇస్తున్నాం. ఒక్కో వ్యక్తికి రూ.2,016 అందిస్తున్నాం. కేంద్రం తరఫున 6,95,000 మందికి మాత్రమే పింఛన్లు అందిస్తున్నారు. పింఛను లబ్ధిదారుల్లో కేవలం 6,95,000 మందికి మాత్రమే కేంద్రం రూ.200చొప్పున ఇస్తుంది.
- కేసీఆర్
ఇదీ చదవండి : రైతులంతా కళ్లెర్రజేసి కేంద్రం కళ్లు తెరిపించాలి: కేసీఆర్