ETV Bharat / state

స్టేషన్​ ఘన​పూర్​లో ప్రతి ఎకరాకు సాగునీరు : రాజయ్య - Station Ghanpur MLA Rajaiah Latest news

జనగామ జిల్లా స్టేషన్​ ఘన​పూర్​ నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు. ఆదివారం స్టేషన్​ ఘన​పూర్​ మండలం తాటికొండ గ్రామ శివారులోని వల్లభరాయ చెరువు వద్ద పూజలు నిర్వహించారు.

రాజయ్య
రాజయ్య
author img

By

Published : May 11, 2020, 12:07 AM IST

జనగామ జిల్లా స్టేషన్​ ఘనపూర్​ నియోజకవర్గంలోని ప్రతి చెరువును దేవాదుల నీటితో నింపే చర్యలు చేపట్టినట్లు స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు. ప్రతి రైతు ఏడాదికి మూడు పంటలు పండించే విధంగా నీటిని సరఫరా చేస్తామన్నారు. ఆదివారం స్టేషన్​ ఘన​పూర్​ మండలం తాటికొండ గ్రామ శివారులోని వల్లభరాయ చెరువు వద్ద పూజలు నిర్వహించారు.

తాటికొండ వద్ద గల మల్లన్న గండి జలాశయం నుంచి వల్లభరాయ చెరువుకు నీటిని తరలించే కాలువ పనులను పరిశీలించేందుకు 7 కిలోమీటర్ల మేర రాజయ్య పాదయాత్ర చేశారు. చిల్పూర్ మండలంలోని శ్రీపతిపల్లి, లింగంపల్లి, కొండాపూర్ గ్రామాలకు త్వరలోనే దేవాదుల నీరు అందేలా చర్యలు చేపట్టేందుకు అధికారుల చర్చిస్తానన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు ధాన్యాన్ని విక్రయించుకునే లబ్ధి పొందాలని సూచించారు.

ఇదీ చూడండి:'అమ్మా నీకు వందనం' అంటూ అద్భుత సైకత శిల్పం!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.