కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మందిపాలవుతోందని.. దానిని అడ్డుకుని ప్రజలకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చెరుకు సుధాకర్ పేర్కొన్నారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
రాష్ట్రం ఏర్పడితే అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరుగుతోందని జయశంకర్ తెలిపారని.. అది నిజం కావాలని మనం కోరుకోవాలని సుధాకర్ పేర్కొన్నారు. ప్రస్తుతం తమ పార్టీ అదే పనిలో ఉందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సామాజిక న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని అన్నారు. తమ పార్టీని మంత్రులు, ఇతర నాయకులు విమర్శించినంత మాత్రాన బాధపడేది లేదని ఆయన స్పష్టం చేశారు.