ETV Bharat / state

విధుల్లో నిర్లక్ష్యం... నలుగురు పంచాయతీ కార్యదర్శులు సస్పెన్షన్ - జనగామ జిల్లా తాజా వార్తలు

జనగామ జిల్లాలో నలుగురు పంచాయతీ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు పడింది. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం అమలులో నిర్లక్ష్యం వహించినందునే వారిని విధుల నుంచి తొలగించినట్లు జిల్లా పాలనాధికారి నిఖిన తెలిపారు.

Negligence in duties Four panchayat secretaries suspended in janagama
విధుల్లో నిర్లక్ష్యం... నలుగురు పంచాయతీ కార్యదర్శులు సస్పెన్షన్
author img

By

Published : Jan 17, 2021, 6:11 AM IST

జిల్లాలో నలుగురు పంచాయతీ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు వేసినట్లు జనగామ కలెక్టర్ నిఖిల తెలిపారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం అమలులో నిర్లక్ష్యం వహించినందునే వారిని విధుల నుంచి తొలగించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

తొలగించిన వారిలో చిల్పూర్ మండలం వంగాలపల్లి పంచాయతీ కార్యదర్శి శ్రీలక్ష్మి, కృష్టాజిగూడెం పంచాయతీ కార్యదర్శి విమల ఉన్నారు. అదేవిధంగా రఘునాధపల్లి మండలం ఖిలశాపూర్ పంచాయతీ కార్యదర్శి నజీర్, దేవరుప్పుల మండలం ధర్మగడ్డతాండ పంచాయతీ కార్యదర్శి సోమేశ్​లను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: రాష్ట్రానికి మరిన్ని వ్యాక్సిన్ డోసులు అవసరం: ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.