జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలో కో ఆప్టేడ్ సభ్యులుగా ఎవరు నామినేషన్ దాఖలు చేయక పోవటం వల్ల వాయిదా పడిన మండల పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఇవాళ కో ఆప్టేడ్ సభ్యురాలిగా మరియపురం గ్రామానికి చెందిన ఎర్వీ ఇన్నమ్మ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. మరెవరూ వేయకపోవటం వల్ల ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఏర్పడిన తరిగొప్పుల మండల తొలి ఎంపీపీగా సోలిపూర్కు చెందిన జొన్నగొని అరిత, వైస్ ఛైర్మన్గా చెన్నురి ప్రమీల ఎన్నికయ్యారు. సమావేశంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పాల్గొని గెలుపొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇవీచూడండి: ఆటోలో బడి పిల్లలు... మద్యం మత్తులో డ్రైవర్