ETV Bharat / state

జన్మదిన కానుకగా నిత్యావసరాల పంపిణీ - మాజీ పీఏసీఎస్ ఛైర్మన్ ఇమ్మడి శ్రీనివాస్​రెడ్డి నిత్యావసరాల పంపిణీ

కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఎవరో ఒకరు అండగా నిలుస్తున్నారు. తాజాగా జనగామ జిల్లా కేంద్రంలో మాజీ పీఏసీఎస్ ఛైర్మన్ ఇమ్మడి శ్రీనివాస్​రెడ్డి అతని కుమారుని జన్మదినం పురస్కరించుకుని నిత్యావసరాలు పంపిణీ చేశారు.

grocery-distribution-to-private-teachers-for his son birthday in-janagama
జన్మదిన కానుకగా నిత్యావసరాల పంపిణీ
author img

By

Published : Oct 8, 2020, 7:27 PM IST

గత ఆరు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయులకు మాజీ పీఏసీఎస్ ఛైర్మన్ ఇమ్మడి శ్రీనివాస్​రెడ్డి నిత్యావసరాలను అందజేశారు. ఆయన కుమారుని జన్మదినం సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో దాదాపు 200 మందికి పంపిణీ చేశారు.

కరోనా కష్టకాలంలో ఉపాధ్యాయులు అవస్థలు పడుతుండడంతో తనవంతుగా ఈ సహకారం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆపద సమయంలో ఎవరు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని విన్నవించారు. ఇదివరకే అమ్మ పౌండేషన్ ఆధ్వర్యంలో 300 మందికి అన్నదానం చేసినట్లు శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు: గంగుల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.