కరోనా కట్టడి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. తారుమారు లెక్కలతో ప్రజలను మభ్యపెడుతోందని తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చెరుకు సుధాకర్ విమర్శించారు. జనగామలోని పూలే భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఆసియాలో మంచి గుర్తింపు పొందిన గాంధీ ఆసుపత్రిని.. కొవిడ్ ఆసుపత్రిగా మార్చి ప్రతిష్ట దెబ్బతీశారని తెరాసపై మండిపడ్డారు. గతంలో ఉస్మానియా ఆసుపత్రిని ఇదేవిధంగా చేసినట్లు ఆరోపించారు.
రాష్ట్రంలో మంత్రులకు సేచ్ఛ కరవు
రెండు నెలల్లో గచ్చిబౌలి స్టేడియంను ట్రిమ్స్ ఆస్పత్రిగా చేశామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం.. ఒక్క కోవిడ్ బాధితుడికి కూడా చికిత్స ఎందుకు అందించలేదని సుధాకర్ సర్కారును నిలదీశారు. తెలంగాణ ఉద్యమ కారులను విస్మరించి.. ఉద్యమ ద్రోహులను పక్కన చేర్చుకొని సీఎం దొరల పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఏమంత్రికి సేచ్ఛలేదని..రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చూడండి: కరోనా మహమ్మారికి చిక్కి పలువురు అధికారులు ఉక్కిరిబిక్కిరి