ETV Bharat / state

BRS MLA Ticket Fight in Jangaon : రచ్చకెక్కిన ఎమ్మెల్యే టికెట్‌ గొడవ.. ఆ ఛాన్స్ ఎవరికో మరి..? - తెలంగాణ న్యూస్

BRS MLA Ticket Fight in Jangaon : జనగామ బీఆర్‌ఎస్‌ రాజకీయం రచ్చకెక్కింది. హైదరాబాద్ వేదిక రోజుకో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం పల్లా రాజేశ్వర్ రెడ్డికి మద్దతుగా కొందరు నాయకులు సమావేశం కాగా.. నిన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో ఆయన అనుచరులు భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుట్రలన్నీ గమనిస్తున్నారని.. తనకు అన్యాయం జరగదని ముత్తిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

MLA Ticket
MLA Ticket Fight in Jangaon
author img

By

Published : Aug 18, 2023, 2:16 PM IST

Updated : Aug 18, 2023, 3:34 PM IST

BRS MLA Ticket Fight in Jangaon : బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఖరారు కొలిక్కి వచ్చిన దశలో.. జనగామ రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో పాటు ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి జనగామ టికెట్‌ను ఆశిస్తున్నారు. కొంతకాలంగా అంతర్గతంగా ఉన్న నేతల మధ్య పోటీ.. బహిరంగమయ్యాయి. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి బలప్రదర్శనకు దిగుతున్నారు.

MLA Ticket Fight Between Muthireddy vs Pochampally : బుధవారం ప్రగతి భవన్‌ పక్కనే ఉన్న హరిత ప్లాజా హోటల్‌లో జనగామ, చేర్యాలకు చెందిన బీఆర్‌ఎస్‌ నేతలు, పలువురు స్థానిక సంస్థల ప్రతినిధులు సమావేశమయ్యారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, జనగామ మున్సిపల్ ఛైర్‌ పర్సన్, ఎంపీటీసీలు, తదితర నేతలు ఉన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికి మద్దతుగా వారందరూ.. బీఆర్‌ఎస్‌ పెద్దలను కలిసేందుకే వారందరూ అక్కడ కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. ముత్తిరెడ్డి యాదగిరి(MLA Muthireddy Yadagiri Reddy) హోటల్‌కు వెళ్లి ఇలా సమావేశం కావడం సరైన పద్ధతి కాదనడంతో కొంత వాగ్వాదం జరిగింది.

''నేతలను బలపరచడానికి అయితే అందరి ముందు వారిని కలుస్తా.. కానీ నాకు పని ఉంది నేను ఎల్లుండి వస్తాను అంటే మా కార్యకర్తలు జరుగుతున్న పరిణామాలకు కలత చెందారు అందుకే వారిని కలవడానికి వచ్చాను. జరుగుతున్న పరిణామాలు మా పార్టీకి విరుద్ధం. ముఖ్యమంత్రి లక్ష్యానికి విరుద్ధం. సీఎంకు ఇలాంటి గ్యాబ్లింగ్‌లు తెలియదు. ఏదైనా పోరాడి గెలుచుకుంటారు. నాకు పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి ఎలాంటి గొడవలు లేవు. అలాంటివి ఏవైనా ఉంటే ముఖ్యమంత్రిగారు తెలుసుకుంటారు. సరిదిద్దుతారు. రాష్ట్రంలో జరుగుతున్న కుట్రల్నే ఆయన సరిదిద్దారు ఇలాంటివి ఆయనకు ఎంత.'' - ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జనగామ ఎమ్మెల్యే

'MLA Muthireddy and his Daughter Controversy : 'నా తండ్రికి రూ.వేల కోట్ల ఆస్తులున్నాయ్.. ఇలా చేయడం తప్పు'

MLA Muthireddy Vs Palla Rajeshwar Reddy in Jangaon : ఆ సమావేశానికి పోటీగా అనే విధంగా నిన్న నాచారంలోని సొంత ఫంక్షన్ హాల్‌లో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అనుచరులతో సమావేశమయ్యారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి టికెట్ (Jangaon BRS Ticket Fight News) ఇవ్వొద్దని.. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికే మళ్లీ అవకాశం ఇవ్వాలని సమావేశానికి హాజరైన జనగామ నాయకులు సమావేశంలో పేర్కొన్నారు.

స్టార్ హోటళ్లకు పిలిపించి సమావేశాలు పెట్టడం పార్టీ విధానాలకు విరుద్ధమని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. తాను బలప్రదర్శన కోసం సమావేశం పెట్టలేదని..ఏదో కుట్ర జరుగుతోందన్న ఆందోళనతో కార్యకర్తలు వస్తే వారితో మాట్లాడానని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పేర్కొన్నారు. ఎన్నో కుట్రలను చేధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు జనగామ కుట్రను తెలుసుకోవడం పెద్ద విషయమేమీ కాదన్నారు. గులాబీ అధినేత కేసీఆర్‌ జనగామ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారోనని ఆసక్తి నెలకొంది.

Disputes in Warangal BRS Leaders : గులాబీవనంలో గుబులు.. సొంత పార్టీ నేతల మధ్య లోపించిన సఖ్యత

MLA Muthireddy and his Daughter Controversy : 'నీతిగా ప్రజా క్షేత్రంలో ఎదుర్కోవాలి తప్ప.. దుర్మార్గపు చర్యలు చేయరాదు

Last Updated : Aug 18, 2023, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.