సీఎం కేసీఆర్ ఇచ్చిన నిరుద్యోగ భృతి హామిని నిలబెట్టుకోవాలని భారతీయ జనతా యువమోర్చా నేతలు డిమాండ్ చేశారు. రెండు లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని పేర్కొన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని హన్మకొండ-హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
భర్తీ చేయాలి..
తెరాస ప్రభుత్వం రెండోసారి అధికారంలోకొచ్చినప్పట్టి నుంచి నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ నుంచి జీతాలు లేక ప్రైవేటు టీచర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వారిని ఆదుకోవాలని సూచించారు. రాస్తారోకో నిర్వహిస్తున్న నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
ఇదీ చూడండి: ఉద్యోగాల భర్తీ కోసం రాస్తారోకో నిర్వహించిన భాజపా యువమోర్చా