జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలికొండలో విషాదం చోటుచేసుకొంది. అలుకుంట గంగరాజు అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీఏ ఎల్ఎల్బీ చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేసినా కొలువు సాధించకపోవడం వల్ల మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకున్నాడు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.