ETV Bharat / state

కూరగాయలు అమ్ముకోవడానికి అవకాశం ఇవ్వాలని రైతుల ఆందోళన

author img

By

Published : Jun 24, 2020, 7:45 PM IST

మెట్‌పల్లి పురపాలక కార్యాలయం ముందు రైతులు ఆందోళన చేపట్టారు. పాత మార్కెట్‌లో అమ్మకాలు జరుపుకునేందుకు అవకాశం కల్పించాలంటూ కమిషనర్‌కు విన్నవించారు.

vegetables selling farmers protest at metpally municipal office in jagtial district
అమ్ముకునేెందుకు అవకాశం ఇవ్వండి సారు...!

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పురపాలక కార్యాలయం ముందు అన్నదాతలు ఆందోళన చేపట్టారు. మెట్‌పల్లిలోని నూతన మార్కెట్‌లో కూరగాయల విక్రయాలు జరగక నష్టపోతున్నామని తెలిపారు. పాత మార్కెట్‌లో అమ్మకాలు జరుపుకునేందుకు అవకాశం కల్పించాలంటూ.. పురపాలక కమిషనర్ జగదీశ్వర్ గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు.

లాక్‌డౌన్‌ కారణంగా అధికారులు మెట్‌పల్లిలోని మార్కెట్‌ను మరోచోటకు మార్చారు. కొత్త మార్కెట్ వద్ద అమ్మకాలు సరిగా సాగడం లేదని... కనీసం రవాణా చార్జీలు కూడా మిగలడం లేదని రైతులు వాపోతున్నారు. కరోనా కష్టకాలంలో కూరగాయలు అమ్ముకుని బతుకుదామంటే.. అధికారులు అడ్డుకోవడం ఎంతవరకూ సబబని రైతులు ప్రశ్నిస్తున్నారు.

ఇదీ చూడండి: న్యూజెర్సీ స్విమ్మింగ్​ పూల్​లో​ శవాలుగా భారతీయులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.