జగిత్యాల జిల్లా మెట్పల్లి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వరలక్ష్మి పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని అందంగా అలంకరించి వరలక్ష్మి వ్రతాలు చేపట్టారు. ఈ వ్రతంలో పాల్గొనేందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులు అమ్మవారి సేవలో పాల్గొని తరించిపోయారు.
ఇవీ చూడండి: మొక్కలకు పుట్టినరోజు..చిన్నారుల సంబురాలు.