బండి సంజయ్ పర్యటన సందర్భంగా జగిత్యాలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బండి సంజయ్ పర్యటన సందర్భంగా తెరాస శ్రేణుల నిరసనకు దిగారు. ఎమ్మెల్యే సంజయ్, జడ్పీ ఛైర్‌పర్సన్ వసంత నేతృత్వంలో తెరాస నిరసన చేపట్టింది. కేంద్రం వెంటనే ఉపాధి హామీ నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
తెరాస కార్యకర్తలను అరెస్టు చేయాలని పోలీసులతో భాజపా శ్రేణుల వాగ్వాదానికి దిగారు. జగిత్యాలలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే సంజయ్, జడ్పీ ఛైర్‌పర్సన్ వసంతను అదుపులోకి తీసుకున్నారు. భాజపా కార్యకర్తల సమావేశానికి బండి సంజయ్ హాజరుకానున్నారు.
ఇదీ చూడండి: ఏమరుపాటు వద్దు... మాస్కే ప్రధానాస్త్రం: సీసీఎంబీ డైరెక్టర్