ETV Bharat / state

పీఆర్సీపై ఉపాధ్యాయుల నిరసన.. ధర్నా - telangana varthalu

జగిత్యాలలోని తహసీల్​ చౌరస్తాలో పీఆర్​సీ నివేదికకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. పీఆర్​సీ నివేదిక ప్రతులను కాల్చివేసి నిరసన వ్యక్తం చేశారు.

ఉపాధ్యాయుల నిరసన... పీఆర్‌సీ నివేదిక ప్రతుల దహనం

author img

By

Published : Jan 27, 2021, 7:03 PM IST

ఉపాధ్యాయ సంఘం(టీపీయూఎస్​) ఆధ్వర్యంలో జగిత్యాలలోని తహసీల్‌ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. పీఆర్‌సీ నివేదిక ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఉపాధ్యాయులు ఆందోళన చేశారు. ప్రభుత్వానికి అందజేసిన నివేదిక కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని ప్రభుత్వంపై మండిపడ్డారు.

ఈ సందర్భంగా ప్రతులను కాల్చివేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు తగ్గట్లు నిర్ణయం తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘం నాయకులు సీఎం కేసీఆర్‌ను కోరారు.

ఉపాధ్యాయుల నిరసన... పీఆర్‌సీ నివేదిక ప్రతుల దహనం

ఇదీ చదవండి: పీఆర్సీపై ఉద్యోగసంఘాల ఆగ్రహం.. పోలీసుల అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.