జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సభ్యులు ఆందోళన నిర్వహించారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. సర్వీసు రూల్స్, పదోన్నతులు, సీపీఎస్ రద్దు, ఐర్, పీఆర్‌సీ తదితర అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఉపాధ్యాయ సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు ఎదొర్కుంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.
ఇవీ చూడండి: కిడ్నాప్ చేసి ఎంపీటీసీని హతమార్చిన మావోలు