ETV Bharat / state

త్వరలోనే ఆ ప్రాంత రైతుల పొలాలకు శ్రీరాంసాగర్ జలాలు - sriram sagar Rejuvanation latest News

శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్ పునరుజ్జీవ పథకంలో భాగంగా ఆయకట్టు రైతులకు కాల్వ ద్వారా సాగు నీరు అందించనున్నారు. ఈ మేరకు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమస్యపై దృష్టి సారించారు. త్వరలోనే నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లోని పలు మండలాల్లో అన్నదాతల సాగు నీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం పురోగతి పనులు చేపట్టింది.

త్వరలోనే ఆ ప్రాంత రైతుల పొలాలకు శ్రీరాంసాగర్ జలాలు

author img

By

Published : Jul 16, 2020, 1:38 PM IST

ఉత్తర తెలంగాణకే మణిహారమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పునరుజ్జీవ పథకంలో భాగంగా ప్రభుత్వం వరద కాల్వ ఆయకట్టును స్థిరీకరించింది. ఫలితంగా భూగర్భ జలాలు పెరగడమే కాకుండా చిన్ననీటి వనరులూ కళకళలాడుతున్నాయి. వరద కాల్వ దిగువ ప్రాంత రైతుల్లో ఆనందం తొణికిసలాడుతున్నా.. ఎగువ ప్రాంత రైతులు మాత్రం సాగునీటికి కటకటలాడుతున్నారు. సమీపంలోనే వరదకాల్వతో పాటు ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం అందుబాటులో ఉన్నప్పటికీ.. సాగునీటి వెతలు తీరడం లేదని గత కొన్నేళ్లుగా అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో రైతుల మొరను ఆలకించిన సీఎం కేసీఆర్.. పురోగతి పనులకు పూనుకోవడంతో రైతుల్లో ఆశలు చిగురుస్తున్నాయి.

ఎస్సారెస్పీ ప్రాజెక్ట్​లోని మిగులు జలాలను దిగువ ప్రాంతాలకు తరలించేందుకు వరద కాల్వ తవ్వినప్పటికీ తగినన్ని జలాలు అందుబాటులో లేకపోవడం వల్ల కాల్వ నిరుపయోగంగా మారింది. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో మహారాష్ట్ర సర్కార్‌ బాబ్లీతో పాటు మరిన్ని ఎన్నిపోతల పథకాలు నిర్మించారు. ఈ నేపథ్యంలో శ్రీరాంసాగర్​పై ఆధారపడిన రైతులు సాగునీటికి ఇబ్బంది పడాల్సిన దుస్థితి నెలకొంది.

పునరుజ్జీవ పథకంతో నీరు పుష్కలం..

పునరుజ్జీవ పథకంతో వరద కాల్వలో నీరు పుష్కలంగా నిల్వ ఉంటున్నాయి. నీరున్నా సమృద్ధిగా ఉన్నప్పటికీ జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలోని మండలాల రైతులు మాత్రం ఇంకా సాగునీటికి ఇబ్బంది పడుతూనే ఉన్నారు.

ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేరుగా రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వరద కాల్వ జగిత్యాల జిల్లా ఇబ్రాహీంపట్నం మండలంలో ప్రారంభమై మెట్‌‌పల్లి, కోరుట్ల, కథలాపూర్‌, మేడిపల్లి, జగిత్యాల, మల్యాల, పెగడపల్లి మండలాల మీదుగా 69 కిమీ మేర ఉంటుంది. ఈ ప్రాంతాల్లో దిగువ ఉన్న ప్రాంతాల చెరువులను నింపేందుకు 49 తూములు నిర్మించడం వల్ల 50వేల ఎకరాలకు సాగు నీరందుతోంది.

ఎగువన అసంతృప్తి

ఎగువన ఉన్న కథలాపూర్‌, మేడిపల్లి, చందుర్తి తదితర మండలాలకు మాత్రం నీరందట్లేదన్న అసంతృప్తి రైతుల్లో నెలకొంది. ఈ క్రమంలో రైతులతో సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్.. ఓటీలు ఏర్పాటు చేయడానికి ఆదేశించారు. సీఎం తీసుకున్న నిర్ణయం పట్ల జర్మనీలో ఉన్న వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్‌ బాబు హర్షం వ్యక్తం చేశారు.

'ఆ విషయంలో చరిత్రకెక్కాం'

సాగునీటి కోసం వందలాది బోర్లు తవ్వించడమే కాకుండా అత్యధికంగా విద్యుత్‌ వినియోగించే మండలాలుగా రికార్డులకు ఎక్కామని రైతులు తెలిపారు. వరద కాల్వ నుంచి తమ పొలాలకు లక్షలాది రూపాయలు వెచ్చించి పైప్​లైన్లు వేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించామని.. ఈ క్రమంలో మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లగా కేసీఆర్ దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లినట్లు ఆనందం వ్యక్తం చేశారు. మరో 4 నెలల్లో తమ సాగు నీటి సమస్య తీరనుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి : ఉస్మానియా శిథిలావస్థకు చేరింది.. చర్యలు చేపట్టండి: బండి సంజయ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.