ETV Bharat / state

శ్రావణ సోమవారం గర్భగుడిలో శివలింగంపై పాము - గర్భగుడిలో పాము ప్రత్యక్షం

జగిత్యాల జిల్లా మల్లాపూర మండలం కుస్తాపూర్​లోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో... సోమవారం నాడు నాగుపాము ప్రత్యక్షమైంది. శ్రావణ సోమవారం నాడు శివలింగంపై పడగ విప్పిన న పామును చూసి అంతా భక్తి పారవశ్యానికి లోనయ్యారు. అసలు ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో తెలుసుకుందాం.

snake on shivalingam in kusthapur ramalingeshwara swamy temple
గర్భగుడిలో శివలింగంపై పాము.. అది శ్రావణ సోమవారం నాడు
author img

By

Published : Aug 11, 2020, 8:11 AM IST

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కు స్తాపూర్ గ్రామంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సోమవారం ఆలయ అర్చకులు శివునికి విశేష అభిషేకాలు నిర్వహిస్తుంటారు. శ్రావణ సోమవారం సందర్భంగా శివునికి పంచామృతాలతో అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని... పాములు పట్టి వ్యక్తి రెండు పాములతో ఆలయం వద్దకు వచ్చి బిక్షాటన చేస్తున్నాడు. ఆలయ అర్చకుడు పాముల గురించి ఆరా తీయగా... విష కోరలు తీశామని, పట్టుకున్నా ఎలాంటి ప్రమాదం లేదని వివరించాడు.

అర్చకుడు పామును చేతిలోకి తీసుకోగా... ఇంతలో అది జారి గర్భగుడిలోకి వెళ్లి పడగవిప్పి శివలింగంపైకి చేరుకుంది. శ్రావణ సోమవారం నాడు సాక్షాతతు శివుడు పామురూపంలో దర్శనమిచ్చాడని భక్తులు భక్తి పారవశ్యానికి లోనయ్యారు. వెంటనే తమ చేతుల్లో ఉన్న చరవాణీలకు పని చెప్పారు. ఫొటోలో తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అవి కాస్త విస్తృతంగా ప్రచారమయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.