జగిత్యాల జిల్లా మేడిపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు.
కోరుట్ల వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. యువకుల పైనుంచి బస్సు వెనుక టైర్లు వెళ్లడం వల్ల యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతులు ఏపీలోని ప్రకాశం జిల్లా గుండ్లపల్లికి చెందిన కుంచల శివ, మంగమురుకు చెందిన నవీన్‌గా గుర్తించారు.
ఇవీచూడండి: స్పా సెంటర్లపై టాస్క్ ఫోర్స్ దాడులు... 28 మంది అరెస్ట్