Jagtial master plan draft cancelled : జగిత్యాలలో మున్సిపల్ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ముగిసింది. జగిత్యాల మాస్టర్ ప్లాన్ ముసాయిదా రద్దు చేస్తూ ఈ కౌన్సిల్లో తీర్మానించారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలన్న తీర్మానానికి అందరూ ఆమోదం తెలిపారు. అంతకుముందు ఈ సమావేశంలో వాడీవేడి వాదనలు జరిగాయి. ఎమ్మెల్యే సంజయ్‌ను కొందరు కౌన్సిలర్లు నిలదీశారు. మాస్టర్ ప్లాన్‌ను మీరే రూపొందించి, మీరే ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు.
"మాస్టర్ ప్లాన్‌ను అడ్డం పెట్టుకొని భాజపా, కాంగ్రెస్ రాజకీయం చేస్తున్నాయి. జీవన్‌రెడ్డి హయంలో జగిత్యాల పట్టణం అభివృద్ధికి నోచుకోలేదు. 1996లో కాంగ్రెస్ హయాంలో తయారు చేసిన మాస్టర్ ప్లాన్ తప్పుల తడకగా ఉంది. మాస్టర్ ప్లాన్ గురించి జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి మాట్లాడుతా. మాస్టర్ ప్లాన్ ముసాయిదా మాత్రమే జీవన్ రెడ్డికి ఎందుకు అర్థం కాలేదు. జీవన్ రెడ్డి ఇకనైనా రైతులను రెచ్చగొట్టకండి. రైతుల ముసుగులో ఆందోళన చేసేది రాజకీయ నాయకులే. -సంజయ్ కుమార్, ఎమ్మెల్యే
ఇవీ చదవండి: