కరోనా వైరస్ అనగానే జనం వణికిపోతున్నారు. కానీ.. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ సోకిన ముగ్గురు వ్యక్తులను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కలిసి పరామర్శించారు. ఈ ఘటన ఇప్పుడు చర్చానీయంగా మారింది.
ఇటీవల ముంబయి నుంచి వారి శాంపిళ్లను పరీక్షలకు పంపగా... మల్యాల మండలంలోని భార్యాభర్తలకు, గొల్లపల్లి మండలంలోని మరోవ్యక్తికి వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. ఆయన నియోజకవర్గంకు చెందిన వ్యక్తులు కావడం వల్ల సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే తన అనుచరులతో కేవలం మాస్కులు, గ్లౌసులు మాత్రమే ధరించి వారిని కలిశారు. భౌతిక దూరం పాటించినప్పటికీ పాజిటివ్ వ్యక్తులను కలవడం జిల్లాలో చర్చసాగుతోంది.
ఇదీ చదవండి: ఆర్టీసీలో 6 వేలమంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఔట్