జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఆందోళన నిర్వహించారు. డిపో ఎదుట ధర్నా చేశారు. అనంతరం జాతీయ రహదారిపై పాత బస్టాండ్ వరకు ర్యాలీ తీశారు. పాత బస్టాండ్ చౌరస్తా వద్ద కార్మికులు మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
52 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె విరమించి విధుల్లో చేరుతామని చెప్పినా ముఖ్యమంత్రి స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా కార్మికుల కష్టాలు అర్థం చేసుకొని బేషరతుగా విధుల్లో చేర్చుకోవాలని లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: ఈయూ కార్యాలయంలో ఆర్టీసీ ఐకాస భేటీ