జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కాచారం గ్రామానికి చెందిన మ్యాదరి రమేశ్ తమకు న్యాయం చేయాలంటూ రాష్ట్ర హెచ్ఆర్సీని ఆశ్రయించారు. తన తల్లి మ్యాదరి అంజవ్వ జీవనోపాధి కోసం స్త్రీనిధి ద్వారా సౌభాగ్య రుణం కోసం దరఖాస్తు చేసుకుందని తెలిపారు. 2019 జూన్ 10,11వ తేదీల్లో రుణానికి సంబంధించిన వివిధ తీర్మానాలతో పాటు డాక్యూమెంటేషన్ పూర్తి చేయడం జరిగిందన్నారు. అంతా సవ్యంగా ఉన్నప్పటికీ రుణం మంజూరు కాలేదని పేర్కొన్నారు.
అసలు రుణ మంజూరులో జాప్యం ఎందుకని సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరడం జరిగిందని కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. కానీ ఇంత వరకు సమాధానం రాలేదన్నారు. తమకు న్యాయం చేయాలని కమిషన్ను వేడుకున్నారు. అలాగే రుణం మంజూరుకు అధికారులను ఆదేశించాలంటూ విజ్ఞప్తి చేశారు. కేసు విచారణకు స్వీకరించిన కమిషన్... అసలేం జరిగిందో విచారణ జరిపి జూలై 31లోపు వివరణ ఇవ్వాలని జగిత్యాల జిల్లా కలెక్టర్కు నోటిసులు జారీ చేసింది.