జగిత్యాలలో పోచమ్మ తల్లికి చలి బోనాలు సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. హనుమాన్ వాడ, పోచమ్మ వాడ, పురాణిపేట ప్రాంతాలకు చెందిన మహిళలు పెద్దఎత్తున తరలివచ్చారు. అందరూ ఒక్కసారిగా ఆలయానికి రావడంతో పరిసరాలు సందడిగా మారాయి.
![large number of devotees attended bonalu for pochamma temple in jagtial district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10623007_1_pms.jpg)
అమ్మవారికి బోనాలు సమర్పించిన మహిళలు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటా చలి బోనాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా మహిళలు పెద్ద సంఖ్యలో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.