ప్రైవేట్ వైద్యుల వ్యాక్సిన్ కోటాలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ కరోనా టీకా వేయించుకున్నారు. జిల్లా ఆస్పత్రి వైద్య సిబ్బంది ఆయనకు కొవిడ్ వ్యాక్సిన్ వేశారు. కరోనా టీకాపై ఎలాంటి భయాందోళనలు అవసరం లేదన్నారు.
ప్రజలకు వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ సూచించారు. కరోనా సమయంలోనూ విశేషంగా సేవలందించిన వైద్యసిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.