కాళేశ్వరం పథకంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అబద్ధాలు చెప్పుతున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ విమర్శించారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టును నిర్మిస్తే సగం నిధులతోనే ప్రాజెక్టు నిర్మించవచ్చునని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. అసలు అక్కడ నీటి లభ్యత లేదని జలమండలి ఇచ్చిన నివేదిక ఆధారంగా మేడిగడ్డ వద్ద ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మించిందని స్పష్టం చేశారు. మరో 10 రోజుల్లో వరద కాలువపై నిర్మించిన పునర్ జీవ పథకం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ఎస్సారెస్పీ నుంచి కోదాడ వరకు సస్యశ్యామలం అవుతుందని వెల్లడించారు.
ఇవీచూడండి: సినీ పరిశ్రమకు నూతన పాలసీ విధానం: కేసీఆర్