జగిత్యాలలో జాతీయ గ్రీన్ ట్రైబ్యూనల్ స్టేట్ లెవల్ కమిటీ ఛైర్మన్ జస్టిస్ సీవీ రాములు పర్యటించారు. జిల్లా కలెక్టర్ శరత్, అధికారులతో సమావేశమై పర్యావరణ పరిరక్షణకు చేపడుతున్న చర్యలపై అడిగి తెలుసుకున్నారు. పట్టణాలు, గ్రామాల్లో పొడి, తడి చెత్త వేరుచేయటం, పర్యావరణ పరిరక్షణ విషయాలపై అధికారులతో చర్చించారు. పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో పారిశుద్ధ్య నిర్వహణను కలిసి పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్ డంపింగ్ యార్డును అధికారులతో కలిసి పరశీలించారు. పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.. పాఠశాలల్లోనూ విద్యార్థులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
ఇదీ చూడండినౌహీరా షేక్‌ను అదుపులోకి తీసుకున్న బళ్లారి పోలీసులు
.