జగిత్యాల జడ్పీ ఛైర్పర్సన్ వసంత.. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. బాధితులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యాధికారులతో సమావేశమయ్యారు.
ఆసుపత్రిలో మరిన్ని పడకలు పెంచి, ఎల్లప్పుడు సరిపడా మందులు ఉంచుకోవాలని వైద్యాధికారులకు వసంత సూచించారు. ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలన్నారు.
ఇదీ చదవండి: మాకు ఆరోగ్య రక్షణ కల్పించాలి : రేషన్ డీలర్లు