జగిత్యాలలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి 10 గంటలకు మొదలైన వర్షం అర్ధరాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసింది. జగిత్యాల టవర్ సర్కిల్, బ్రాహ్మణ వాడ, పోచమ్మవాడ, హనుమాన్ వాడలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్ల పైకి వరద నీరు చేరింది. జిల్లాలోని ధర్మపురి, గొల్లపల్లి, మల్యాల, బుగ్గారం మండలాల్లోనూ వర్షం కురిసింది. పంట కోతకొచ్చే వేళ కురుస్తున్న వర్షాలు అన్నదాతను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఇవీ చూడండి: ఉద్యోగం పోయిందనే మనస్థాపంతో ఆర్టీసీ డ్రైవర్ మృతి!