జగిత్యాలలో భారీ వర్షం కురిసింది. ఇన్నాళ్లు వర్షాలు లేక ఇబ్బంది పడ్డ అన్నదాతలకు వాన ఊరటనిచ్చింది. దాదాపు రెండు గంటలకు పైగా కురిసిన వర్షంతో టవర్ సర్కిల్ ప్రాంతంలో రోడ్లన్ని జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలవటం వల్ల ప్రయాణికులు కాస్త ఇబ్బంది పడ్డారు. వీధుల్లో నీటి ప్రవాహం కాలువలను తలపించాయి. రహదారుల్లో నడవలేక పాదచారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.
ఇవీ చూడండి: అటవీశాఖ సిబ్బందిపై తెరాసనేతల దాడి