జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిప్పాయిపల్లికి చెందిన గల్ఫ్ వలస జీవి నరుకుల్ల శ్రీనివాస్ దుర్మరణం విషాదకరంగా మారింది. సొంత గ్రామంలో ఉపాధి లేక గత నాలుగేళ్లుగా గల్ఫ్ దేశమైన ఖతార్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నెల రోజుల క్రితం శ్రీనివాస్ పనిచేస్తున్న కంపెనీలో ప్రమాదం జరిగి మృత్యువాత పడ్డాడు.
తరలింపులో జాప్యం:
అతని మరణ వార్త విన్న మరుక్షణం నుంచి కుటుంబ సభ్యులు రోదనలతో కాలం గడిపారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతదేహం తరలింపులో జాప్యం జరగడం వల్ల చివరికి ఖతార్‌లోని ప్రవాస భారతీయుల గల్ఫ్ సేవ సమితి సభ్యులు.. రాయబార కార్యాలయ అధికారులతో సంప్రదించి చర్యలు తీసుకున్నారు.
నెల రోజుల తర్వాత:
నెల రోజుల అనంతరం నరుకుల్ల శ్రీనివాస్ మృతదేహం తిప్పాయిపల్లి చేరుకోవడం వల్ల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అంతిమయాత్రలో ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. గల్ఫ్‌లో మరణించే వలస జీవులకు ఐదు లక్షల పరిహారం అందించాలని కోరారు.
ఇవీ చూడండి: వైష్ణవి ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ ఆత్మహత్య