ETV Bharat / state

పల్లె ప్రకృతి వనాలతో ఆరోగ్యం, ఆహ్లాదం : ఎమ్మెల్యే - jagtial updates

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు ఆరోగ్యం, ఆహ్లాదం అందిస్తాయని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్​రావు అన్నారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం వేంపేట గ్రామంలో ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతి వనాన్ని జిల్లా పాలనాధికారి రవితో కలిసి ఆయన ప్రారంభించారు.

Green parks inaugaration by Korutla MLA in jagityal di
పల్లె ప్రకృతి వనాలతో ఆరోగ్యం, ఆహ్లాదం : ఎమ్మెల్యే
author img

By

Published : Nov 4, 2020, 4:19 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం వేంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని జిల్లా పాలనాధికారి రవితో కలిసి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్​రావు​ ప్రారంభించారు. వీటి వల్ల గ్రామాల్లో ప్రజలకు ఆరోగ్యం, ఆహ్లాదం లభిస్తాయని ఆయన అన్నారు.

ప్రకృతివనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పరిసరాలన్నీ కలియతిరిగి గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని ఎమ్మెల్యే అభినందించారు. ఈ వనాలతో ప్రజలకు ఆహ్లాదంతో పాటు ప్రశాంత వాతావరణం లభిస్తుందని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు వసంత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'గిట్టుబాటు ధర కల్పించి... ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది'

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.