జగిత్యాల పట్టణానికి చెందిన అరుణ్ కాంత్రి ఐదు గుంటల స్థలంలో 6 ట్యాంకులను ఏర్పాటు చేసి వాటిలో చేపల పెంపకం చేస్తున్నాడు. మూడేళ్లుగా ఈ విధానంలో చేపల పెంపకం చేస్తున్న అరుణ్ ప్రస్తుతం 10 టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నాడు.
పంగస్, పిలాపియా, రూప్‌చంద్ అనే రకాల చేపలను పెంచుతున్నాడు. 6 నెలల్లో రెండు లక్షల వరకు ఆదాయం పొందాడు. అరుణ్ అతని భార్య నవత... పెంచిన చేపలను సొంతగా వారే మార్కెట్ చేసుకుంటున్నారు.
చేపల పెంపకంతోపాటు అరుణ్ దంపతులు పెరటి కోళ్ల పెంపకం కూడా చేస్తున్నాడు. ప్రతి నెలా ఒక ఆదివారం ఇక్కడికి వచ్చే వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి మార్గం చూపిస్తున్నారు.
- ఇదీ చదవండి:కడు పేదరికంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత!