జగిత్యాల పట్టణంలో డ్రైవర్స్ డే, అంతర్జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహించారు. ట్రాఫిక్ పోలీసులు, రవాణాశాఖ అధికారులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో డ్రైవర్లకు ట్రాఫిక్‌పై అవగాహన కల్పించారు.
డ్రైవర్స్ డే సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. ప్రమాదాల నివారణకు డ్రైవర్లు వాహనాలను జాగ్రత్త నడపాలంటూ.. వారికి పువ్వులు అందజేశారు. జగిత్యాల డిపో నుంచి సాగిన ఈ ర్యాలీ కొత్త బస్టాండ్, పాత బస్టాండ్ మీదుగా సాగింది. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ జగదీశ్వర్ ట్రాఫిక్ ఎస్ఐ అనిల్‌తో పాటు ఆర్టీసీ డ్రైవర్లు, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: టీమ్ఇండియాకు గాయాల గోల.. అసలెందుకిలా?