ETV Bharat / state

'తెలంగాణలో రాబోయేది- బీజేపీ నేతృత్వంలోని హంగ్ ప్రభుత్వమే' - Telangana BJP Latest News

Dharmapuri Arvind Comments on Govt Formation : రాబోయే ఎన్నికల అనంతరం.. రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో హంగ్ ప్రభుత్వం వస్తుందని.. నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. తెలంగాణలో కాషాయ ప్రభుత్వం ఏర్పాటుకు.. కేంద్ర అధినాయకత్వం కంకణం కట్టుకుందని తెలిపారు.

MP Dharmapuri Arvind Election Campaign
Dharmapuri Arvind Comments on Govt Formation
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 5, 2023, 5:25 PM IST

Dharmapuri Arvind Comments on Govt Formation : రాష్ట్రంలో బీజేపీ(Telangana BJP) పార్టీకి మెజార్టీ వస్తుందని లేదా కమలం నేతృత్వంలో హంగ్​ ప్రభుత్వం వస్తుందని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా మెట్​ప్లలిలో నిర్వహించిన బూత్​ లెవల్​ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డిసెంబల్​ 3న రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో హంగ్​ ప్రభుత్వం వస్తుందంటూ జోస్యం చెప్పారు. బీజేపీ కేంద్ర నాయకత్వం.. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కంకణం కట్టుకుందని పేర్కొన్నారు.

BJP MP Dharmapuri Arvind fires on CM KCR : 'కోరుట్లలో 20వేల మెజార్టీతో గెలుస్తా.. ఇదే నా సవాల్‌'

Telangana Assembly Elections 2023 : తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీకి 40కి పైగా సీట్లు రావడం అసంభవమన్నారు. కాంగ్రెస్​కు, బీఆర్​ఎస్​కు ఎవరికి 40 స్థానాలు వచ్చినా.. బీజేపీ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. టీవీ ఛానళ్లు రాజకీయం చేస్తున్నాయని.. మీడియా రాజకీయం చేస్తే తాము కూడా రాజకీయం చేస్తామన్నారు. ఎన్నికలకు ముందు రాజకీయముంటుంది.. ఎన్నికల తర్వాత కూడా రాజకీయ ఉంటుందని పేర్కొన్నారు.

MP Dharmapuri Arvind Election Campaign : బతుకుదెరువుకు వలసపోయిన గల్ఫ్ కార్మికుల కోసం 500 కోట్లతో ప్రత్యేక బోర్డు కాదు.. బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేస్తుందని వెల్లడించారు. ఈ నెల 7న హైదరాబాద్​లో బీసీ కన్వెన్షన్​కు, 11న ఎస్సీ సమ్మేళనంకు ప్రధాని మోదీ వస్తున్నారని తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్​కు ఈడీ నోటీసులు రాగానే కవిత మాయమైపోయిందని విమర్శించారు. కేసీఆర్​కు రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటో మొత్తం బయటపెడతామన్నారు.

రేవంత్ రెడ్డి.. కేసీఆర్​ను(CM KCR) మించిన మోసగాడని దుయ్యబట్టారు. రాజకీయాల్లో రేవంత్ రెడ్డిని(Revanth Reddy) మించిన మోసగాడు లేడని.. మొత్తం ముంచేస్తాడని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ మంచోడని..కేసీఆర్ కుటుంబానికి ఓటమి రుచి చూపించింది బీజేపేనని పేర్కొన్నారు. కోరుట్లలో తను కనబడతలేనని అంటున్నారని.. నేను కనబడడం మొదలుపెడితే ఇంకెవరు కనబడరని హెచ్చరించారు. పదో తేదీన భారీ ర్యాలీతో.. కోరుట్ల స్థానానికి నామినేషన్ వేస్తానని పేర్కొన్నారు.

"రాబోయే ఎన్నికల అనంతరం.. రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో హంగ్ ప్రభుత్వం వస్తుంది. కాంగ్రెస్​ పార్టీకి 40కి పైగా సీట్లు రావడం అసంభవం. కాంగ్రెస్​కు, బీఆర్​ఎస్​కు ఎవరికి 40 స్థానాలు వచ్చినా.. బీజేపీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అరవింద్ కేజ్రీవాల్​కు ఈడీ నోటీసులు రాగానే కవిత మాయమైపోయింది. కేసీఆర్​కు రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటో మొత్తం బయటపెడతాం". - ధర్మపురి అర్వింద్, నిజాామాబాద్ ఎంపీ

'తెలంగాణలో రాబోయేది- బీజేపీ నేతృత్వంలోని హంగ్ ప్రభుత్వమే'

Nizamabad MP Arvind Fires on Congress Party : రేవంత్​ రెడ్డికి.. కర్ణాటక నుంచి తొలి విడతగా రూ.50 కోట్లు : ఎంపీ ధర్మపురి అర్వింద్

MP Dharmapuri Arvind on Medical Colleges Inauguration : 'ప్రభుత్వం ప్రారంభించిన 9 మెడికల్ కళాశాలల్లో రాష్ట్ర ప్రభుత్వానిది నయా పైసా లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.