జగిత్యాల జిల్లాలో పలు పెట్రోలు బంకుల్లో పౌరసరఫరాలు, తూనికలు కొలతల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వాహనాల్లో ఇంధనం నింపేటప్పుడు కొలతల్లో తేడాలు వస్తున్నాయని అధికారులకు ఫిర్యాదులు అందడంతో తనిఖీలు చేపట్టారు.
పలు బంకులను తనిఖీలు చేసిన అధికారులు.. అందులో ఎలాంటి లోపాలు లేవని తెలిపారు. నిత్యం తనిఖీలు చేస్తామని అవకతవకలకు పాల్పడితే బంకులను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: ఎన్నికల వేడి నుంచి భాగ్యనగరానికి ఉపశమనం..