రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 45 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆర్డీవో కార్యాలంయంలోకి వెళ్లి నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవటంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తెరాస పభుత్వం వెంటనే అమలు చేయాలని.. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: పెళ్లి నగలు కొందామని బయల్దేరిన వధువు సహా ఆరుగురు మృతి