జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రైతులతో విద్యుత్ అధికారులు సమావేశమయ్యారు. అధికారుల అనుమతి లేకుండా వ్యవసాయ భూముల్లో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లల మరమ్మతులు చేపటొద్దని సూచించారు. ఎలాంటి ఇబ్బందులున్నా అధికారులకు సమాచారం అందించాలన్నారు. తుప్పుపట్టిన, విరిగిపోయిన విద్యుత్ స్తంభాలు ఎక్కడున్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. విద్యుత్ ప్రమాదాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
ఇవీచూడండి: "నెలలోపు సమ్మెపై స్పందించకుంటే... భవిష్యత్తు కార్యాచరణ"