ETV Bharat / state

జగిత్యాల జిల్లాలో రెండు రోజుల్లో 6 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు - మద్యం అమ్మకాలు

సుదీర్ఘ విరామం తర్వాత తెరచుకున్న మద్యం దుకాణాలకు మద్యం ప్రియులు పోటెత్తారు. జగిత్యాల జిల్లాలో రెండు రోజుల్లోనే 6 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు సాగినట్లు ఎక్సైజ్​ అధికారులు తెలిపారు.

alcohol sales in jagitial district
జగిత్యాల జిల్లాలో రెండు రోజుల్లో 6 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు
author img

By

Published : May 7, 2020, 10:45 PM IST

జగిత్యాల జిల్లాలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. బుధవారం నుంచి జిల్లాలో 64 మద్యం దుకాణాలు తెరచుకోగా.... తొలి రోజు 4022 బాక్సుల మద్యం, 5052 కాటన్ల బీర్ల అమ్మకాలు జరిగాయి. వీటి విలువ 3కోట్ల 10 లక్షల75 వేల 292 రూపాయలు ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గురువారం కూడా మూడు కోట్లకు పైగా అమ్మకాలు సాగినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీధర్ ప్రకటించారు. రెండు రోజుల్లో 6 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు సాగటం వల్ల... జిల్లాలో మందుబాబులు జోరుగా మద్యం సేవిస్తున్నట్లు తెలుస్తోంది.
జిల్లాలో 64 దుకాణాలు ఉండగా బుధవారం ఉదయం 10 గంటలకు పోలీసు అధికారుల సమక్షంలో దుకాణాలు తెరిచారు. మద్యం కొనేందుకు ఉదయం 8 గంటల నుంచి మద్యం ప్రియులు దుకాణాల ముందు బారులు తీరారు. రెండో రోజు కూడా అదే జోరు కొనసాగింది. భౌతిక దూరం పాటించేలా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 15.. మొత్తం 1122 కరోనా పాజిటివ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.