జగిత్యాల జిల్లాలో దుబాయి నుంచి వచ్చిన యువకుడికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. పెగడపల్లి మండలం లింగాపూర్‌కు చెందిన యువకుడు 15 రోజుల క్రితం దుబాయి నుంచి స్వగ్రామానికి వచ్చాడు.
తీవ్ర జ్వరం, జలుబుతో బాధపడుతున్న యువకుడిని స్థానిక వైద్యులు... అనుమానంతో గాంధీ ఆసుపత్రికి పంపించారు. వైద్య పరీక్షల అనంతరం అతనికి వైరస్ సోకిందా లేదా అనే విషయాన్ని వైద్యులు వెల్లడించనున్నారు.
ఇవీ చూడండి: సాయం చేస్తే కుంభకోణం అనడం తగదు: కేసీఆర్