ETV Bharat / state

దోమపోటు సోకిందని పంటకు నిప్పంటించిన రైతు

ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ఓ రైతు తన చేతులతోనే నిప్పంటించాడు. చూస్తుండగానే 4 ఎకరాల్లో సాగు చేసిన వరి పంటంతా కాలి బూడిదైపోయింది. అసలేమైందంటే..

A farmer set fire to a crop that was infected with mosquitoes
దోమపోటు సోకిందని పంటకు నిప్పంటించిన రైతు
author img

By

Published : Oct 27, 2020, 3:57 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం ఆత్మకూరులో తుమ్మల తిరుపతి అనే రైతు తన వరి పంటకు నిప్పంటించాడు. ఆరుగాలం కష్టపడి పండించిన 4 ఎకరాల సన్నరకం వరి పంటకు దోమపోటు సోకింది. పంటంతా కోసి నూర్పిడి చేసినా క్వింటాలు ధాన్యం చేతికొచ్చే పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి లోనైన తిరుపతి.. తన చేతులతోనే పంటకు నిప్పంటించాడు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు సన్నరకం వరి సాగుచేస్తే దోమపోటుతో పంటంతా నాశనం అయ్యిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.

ఇదీ చూడండి.. అభివృద్ధి ప‌నుల్లో ఆల‌స్యం త‌గ‌దు: మంత్రి ఎర్రబెల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.